: ఏ క్షణంలోనైనా శశికళను అరెస్ట్ చేసే అవకాశం
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఆమెను చెన్నైలోనే ఉంచి, రేపు ఉదయం బెంగళూరుకు తరలించి, కర్ణాటక పోలీసులకు అప్పగించనున్నట్టు సమాచారం. మరోవైపు, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తాను లొంగిపోవడానికి మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసే యోచనలో శశికళ ఉన్నారు. ఈమేరకు లాయర్లతో ఆమె చర్చలు జరుపుతున్నారు.