: బ్రహ్మోస్‌ క్షిపణి విషయంలో భారత్ పొరుగు దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: పారికర్


చైనా దూకుడును అదుపులో పెట్టేలా సరిహద్దులో భార‌త్‌ బ్రహ్మోస్‌ క్షిపణిని మోహరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ స్పందించారు. చైనా, పాక్‌లతో భారత్‌ సత్సంబంధాలే కోరుకుంటోందని, అందులో అనుమానాలేవీ వ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. అయితే, ఎవరైనా భారత్‌ భద్రతను ప్రశ్నిస్తే మాత్రం వారికి సరైన జ‌వాబు చెప్పటం కోసమే తాము స‌న్నాహాలు చేసుకుంటున్నామ‌ని తెలిపారు. బ్ర‌హ్మోస్ గురించి పొరుగుదేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ర‌క్షణ రంగంలో విదేశీ పెట్టుబడులపై పలు అభిప్రాయభేదాలు వ్య‌క్త‌మ‌వుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని, కానీ దేశభద్రత దృష్ట్యా తాము ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News