: శశికళకు వీర విధేయుడు పళనిస్వామి గురించిన వివరాలు!


అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత గా మంత్రి పళనిస్వామిని శశికళ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఈ హోదా కట్టబెట్టడానికి గల ప్రధాన అర్హత ..శశికళకు ఆయన వీరవిధేయుడు కావడమేనని చిన్నమ్మ వర్గాలు చెబుతున్నాయి. హై వేస్ అండ్ మైనార్టీ పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పళని స్వామి గురించిన మరిన్ని వివరాలు..

* గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి విద్యార్థి నేతగా ఉన్న సమయంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు.
* 1989,1991, 2011, 2016 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచారు.
* ప్రస్తుతం సేలం జిల్లాలోని ఎడప్పడి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
* పశ్చిమ తమిళనాడులో గౌండర్ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది.
* జయలలిత మృతి చెందిన తర్వాత, పళనిస్వామిని సీఎంను చేయాలని శశికళ అనుకున్నారట.

  • Loading...

More Telugu News