: నా బలమేంటో శశికళకు అసెంబ్లీలో చూపిస్తా: పన్నీర్ సెల్వం


మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజల దృష్టిని మరల్చేందుకు శశికళ యత్నిస్తున్నారని పన్నీర్ సెల్వం ఆరోపించారు. శశికళ వల్ల రిసార్టులోని ఎమ్మెల్యేలు చాలా బాధలు పడ్డారని అన్నారు. తన బలమేంటో శశికళకు అసెంబ్లీలో చూపిస్తానని చెప్పారు. ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటున్నాడని తెలిపారు. తమిళ పార్టీలే కాకుండా, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఇదే కోరుకుంటోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమయిన మీడియా... రిసార్టులో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చూపించాలని కోరారు.

  • Loading...

More Telugu News