: మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారు: రిసార్టులో శశికళ ఆవేద‌న


త‌న‌కు నాలుగు ఏళ్ల శిక్ష‌ను విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ప‌ట్ల నిరాశ‌, బాధ‌తో ఉన్న శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ ఈ రోజు గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేల‌తో ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీలో ఏర్ప‌డిన‌ సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమని వ్యాఖ్యానించిన ఆమె... మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని, అనంత‌రం జ‌య‌ల‌లిత‌ సమాధి వద్ద  ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దామ‌ని ఆమె వ్యాఖ్యానించారు.

పార్టీ నేత‌లంతా త‌న‌కు ఓ కుటుంబంలా అండగా ఉంటే తాను అన్నిటినీ సాధిస్తాన‌ని శశికళ అన్నారు. అమ్మ జ‌య‌ల‌లిత ఆశీర్వాదాలు త‌న‌కు ఉన్నాయ‌ని, 129 మంది ఎమ్మెల్యేల మద్దతు త‌న‌కు ఉందని, ఈ విషయంలో విజయం సాధించాక ఆ విజ‌యాన్ని జ‌య‌ల‌లిత‌కు అంకితం ఇద్దామ‌ని ఆమె చెప్పారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తోన్న‌ కుట్రలను గెలిపించ‌కూడ‌ద‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News