: అమ్మ ఆశీస్సులు మనకే ఉన్నాయి: పన్నీర్ సెల్వం


అమ్మ (జయలలిత) ఆశీస్సులు మనకే ఉన్నాయని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో పేర్కొన్నారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, అమ్మ ఆత్మ, ధర్మం మనవైపే ఉన్నాయని అన్నారు. ఆది నుంచి తనకు మద్దతు తెలిపిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజలు, సినీ, వ్యాపార వర్గాలన్నీ తనకు అండగా నిలవడంతో పన్నీర్ సెల్వం ధైర్యంగా ఉన్నారు.

అయినప్పటికీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలపకపోవడం పట్ల ఆయన బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అలాగే వారి మద్దతు తీసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం కూడా లేదు. అయితే పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన శిబిరం కూడా ఆనందంగా లేదు. అదే సమయంలో గవర్నర్ మరి కాస్త ఆలస్యం చేస్తే, తనకు కాలం కలిసి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే తమిళనాట రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతుండడం సర్వత్ర ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News