: జయలలిత మృతికి కూడా శశికళ సమాధానం చెప్పాలి: గౌతమి
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో నిందితురాలిగా ఉన్న శశికళ నటరాజన్‌కు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటీమణులు గౌతమి, ఖుష్బూ స్పందించారు. అవినీతికి పాల్పడినందుకు శశికళ దోషిగా మారారని గౌతమి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అమ్మ జయలలిత మరణానికి కూడా శశికళ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక నటి ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రేమికుల రోజున తమిళనాడు ప్రజలకు సుప్రీంకోర్టు ఉత్తమమైన బహుమతి అందించిందని పేర్కొన్నారు. ప్రజలు ఇక ఎప్పటిలాగే హాయిగా ఊపిరి పీల్చుకుని భయం లేకుండా ఉండవచ్చని ఆమె అన్నారు.