: శశికళ గూడు చెదిరింది.. చెన్నై సూపర్ కింగ్ పన్నీర్ సెల్వం: సోషల్ మీడియాలో కామెంట్ల హోరు!
సమాజంలో ఏ అంశంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నా ఆ టాపిక్‌పై స్పందనలతో సోషల్‌మీడియాలో జోకులు, సెటైర్లు, కార్టూన్లు నిండిపోతాయి. ముఖ్యమంత్రి పదవి కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకు వెళుతున్న శశికళ దూకుడుకి సుప్రీంకోర్టు శాశ్వత బ్రేక్ వేయడంతో తమిళనాడు రాజకీయాల గురించి నెటిజన్లు భారీగా పోస్టులు పెడుతున్నారు. ‘తమిళనాడుకు ఇది ప్రేమికుల రోజు కానుక’ అని కొందరు పోస్టులు చేస్తోంటే, శశికళ ఇకపై రిసార్టుల్లో ఎమ్మెల్యేలను లెక్కపెట్టలేదని, జైలులో ఊచలు లెక్కపెట్టుకోవాలని మరి కొందరు జోకులు సెటైర్లు వేస్తున్నారు.
తమిళనాడు ప్రజలకు పన్నీర్, శశికళకు మాత్రం నీళ్ల సాంబారు అని పలువురు పోస్టులు చేశారు. శశికళ గూడు చెదిరింది, న్యాయం మాత్రం గెలిచిందని పలువురు పేర్కొంటున్నారు. అధికారం, డబ్బుతో మనుషులను కొనవచ్చు కానీ సత్యాన్ని కాదని మరికొందరు స్పందిస్తున్నారు. చెన్నయ్ సూపర్ కింగ్ ఇక పన్నీర్ సెల్వమేనని కొందరు పేర్కొంటున్నారు.
The new #Chennai Super King #Panneerselvam
— T S Sudhir (@Iamtssudhir) 14 February 2017