: ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచులకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే భారత్ పర్యటనకు రానుంది. ఈ నెల 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇక రెండో టెస్టు మ్యాచు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వచ్చేనెల 4 నుంచి జరుగుతుంది. ఈ రెండు టెస్టు మ్యాచులకు బీసీసీఐ ఈ రోజు టీమిండియా ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్, కరుణ్, జయంత్, కుల్‌దీప్, ముకుంద్, పాండ్యా ఉన్నారు.