: జయలలిత ఆత్మ గురించి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ తలరాత మొత్తం మారిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న శశి... జైలుకు వెళ్లబోతోందని, ఈ నేపథ్యంలో తన నెచ్చెలి శశికళ పరిస్థితిని చూసి జయ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. జయ ఆత్మ కచ్చితంగా శాంతించదని ట్వీట్ చేశాడు.