: చిన్నమ్మ బాధ చూడలేక కన్నీరు మున్నీరైన ఎమ్మెల్యేలు!
నిన్నటి వరకూ ఆనందంగా ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ లో ప్రస్తుతం వాతావరణం గంభీరంగా మారిపోగా, శశికళ మనో వేదనలో కుంగిపోయారు. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్న వేళ కూడా శశికళ బాధ పడుతుండగా, ఆమెను చూసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కన్నీరుమున్నీరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో తామెంతో బాధపడుతున్నట్టు వెల్లడించిన పలువురు ఎమ్మెల్యేలు శశికళను ఓదార్చేందుకు ప్రయత్నించినట్టు పార్టీ వర్గీయులు తెలిపారు. ఇదిలావుండగా, శశికళ వర్గీయులు దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో చెన్నైలో 20 వేల మంది పోలీసులను మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు.