: సుప్రీంకోర్టు తీర్పుపై కమలహాసన్ స్పందన


శశికళ నటరాజన్‌ను దోషిగా తేల్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె సీఎం అయ్యే దారులు మూసుకుపోయిన నేప‌థ్యంలో సినీన‌టుడు క‌మ‌ల హాస‌న్ ఈ అంశంపై స్పందించారు. ఆయ‌న మొద‌టి నుంచి శ‌శిక‌ళపై విముఖ‌త చూపుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆయ‌న‌ న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ‘ఆ తీర్పులో ఏముందంటే.. పాత పాటే అయినప్పటికీ.. తప్పు చేసిన వ్యక్తి ఎందులోనూ గెలవలేరు’ అని ఆయన త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ప‌లువురు న‌టులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు.



  • Loading...

More Telugu News