: అమ్మ శాపం పెట్టింది... శశికళ జైలుకెళుతోంది: పన్నీర్
పురచ్చితలైవి, అమ్మ జయలలిత పెట్టిన శాపంతోనే శశికళ జైలు ఊచలను లెక్కించనున్నారని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. కొద్దిసేపటిక్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తనను నమ్మిన అమ్మకు శశికళ తీవ్రమైన అన్యాయం చేయాలని చూశారని ఆరోపించారు. దేవుడి దయ, అమ్మ కరుణలతో ఆమె ఆగడాలకు అడ్డుకట్ట పడిందని అన్నారు. ఇక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి, అమ్మ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలనూ కొనసాగిస్తూ, పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని, ఎమ్మెల్యేలంతా తనకు అండగా ఉండాలని కోరారు. అమ్మ ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అందరూ సంయమనం పాటించాలని చెప్పారు. తనకు మద్దతిస్తున్న నేతలకు, అభిమానులకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. విపక్షాలకు అవకాశం ఇచ్చే పరిస్థితి రానివ్వద్దని అన్నారు.