: అమ్మ ఆత్మ ఇంకా మనతోనే ఉంది: పన్నీర్ సెల్వం స్పందన
అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రోజు తన మద్దతుదారులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తనకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు నిలిచారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అమ్మ అందించిన పాలనను పోలిన పాలననే మళ్లీ ప్రజలు చూస్తారని ఆయన అన్నారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమ్మ ఆత్మ ఇంకా తమతోనే ఉందని, ఆమె ఆత్మే తమను గెలిపించేలా చేస్తోందని పన్నీర్ సెల్వం అన్నారు. అమ్మ పెట్టిన పథకాలను కొనసాగిస్తామని చెప్పారు.