: అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వం తొలగింపు


తమిళనాడు రాష్ట్రానికి పళనిస్వామి పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేస్తున్న వేళ, శశికళ మరో నిర్ణయాన్ని ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వంను తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో చీలికకు కుట్ర చేయడం, అధినాయకత్వానికి వ్యతిరేకంగా నడవడం వంటి కారణాలతో ఆయన్ను తొలగిస్తున్నట్టు ఆమె తెలిపారు. పన్నీర్ వద్ద ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని, చీలికకు కారణమైన అతన్ని ప్రజలు క్షమించబోరని ఈ సందర్భంగా శశికళ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News