: ఇలా చేయండి... రిసార్టులో ఎమ్మెల్యేలకు సూచనలు చేసిన శశికళ
తనను దోషిగా తేల్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తనకు సీఎం అయ్యే దారులు మూసుకుపోయిన నేపథ్యంలో శశికళ నటరాజన్ రిసార్టులో ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలని పిలుపునిచ్చారు. తమ ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని, తదుపరి శాసనసభాపక్ష నేతగా అందరికీ ఆమోదయోగ్యమైన వారినే ఎన్నుకుందామని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, జయలలిత మేనల్లుడు దీపక్ పేరునే ఆమె సూచిస్తారని అందరూ భావిస్తున్నారు. మరికాసేపట్లో ఆమె ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పన్నీరు సెల్వం ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.