: ఇక గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి: సుప్రీం తీర్పుపై స్టాలిన్‌ స్పందన


త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్న‌ శశికళతో పాటు మ‌రో ఇద్ద‌రికి సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సుస్థిర పాలన ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని ఆయ‌న చెప్పారు. రాజకీయ నాయకులకు ఈ తీర్పు ఓ గుణపాఠమ‌ని ఆయ‌న అన్నారు. 21 ఏళ్ల తర్వాత తీర్పు రావడం శుభపరిణామమ‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News