: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ... తాను ఈ తీర్పును ముందే ఊహించానని చెప్పారు. శశికళపై సుప్రీంకోర్టు విధించిన ఈ తీర్పునుంచి ఆమె తప్పించుకోలేరని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల తరువాత న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి గవర్నర్ వెంటనే ముగింపు ఇవ్వాలని ఆయన సూచించారు.