: శశికళే స్వయంగా లొంగిపోతారు: పోలీసులతో అన్నాడీఎంకే నేతలు


సుప్రీంకోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో, తమ విచక్షణాధికారాలతో ఆమెను నేడే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని పోలీసులు భారీ సంఖ్యలో గోల్డెన్ బే రిసార్టుకు చేరుకున్న వేళ, ఆమే స్వయంగా వచ్చి లొంగిపోతారని పోలీసు అధికారులకు అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో సమావేశమై, వారికి దిశానిర్దేశం చేసి, ఆపై శశికళ పోలీసులకు లొంగిపోతారని వారు చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు రిసార్టును దిగ్బంధించిన తమిళనాడు పోలీసులు, ఇప్పటికే వారం రోజులుగా అక్కడ ఉన్న బౌన్సర్లను, ఇతర అన్నాడీఎంకే కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. ఇప్పుడిక ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వారివారి ఇళ్లకు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికింకా ఎమ్మెల్యేలు ఎవరూ రిసార్టు నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. దాదాపు 500 మందికి పైగా పోలీసులు రిసార్టు చుట్టూ ప్రస్తుతం ఉన్నారు. 

  • Loading...

More Telugu News