: దాదాపు 20 ఏళ్లు జయ, శశికళపై కేసు సాగుతూ వచ్చిందిలా!


దాదాపు 20 సంవత్సరాలకు పైగా సాగిన జయలలిత అక్రమాస్తుల కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. దేశంలోనే సంచలనం రేపిన ఈ కేసును 1996లో అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేశారు. ఆపై కేసు ఎన్నో ఆసక్తికర మలుపులు తిరిగింది. కేసులో ముఖ్యాంశాలు...

* 1996లో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.
* డిసెంబర్ 7, 1996: అన్నాడీఎంకే నేత జయలలిత అరెస్ట్.
* ఏప్రిల్ 17, 1997: జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లపై 41 కేసులు - విచారణకు మూడు కోర్టుల ఏర్పాటు.
* జూన్ 4, 1997: ఐపీసీలోని సెక్షన్ 120-బీ, అవినీతి నిరోధక చట్టం 1988లోని 13(2) రెడ్ విత్ 13(1)(ఇ) సెక్షన్ల కింద కేసులు. చార్జ్ షీట్ దాఖలు.
* అక్టోబర్ 1, 1997: కేసును కొట్టివేయాలంటూ, మూడు పిటిషన్లను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు.
* ఫిబ్రవరి 5, 1999: ప్రత్యేక కోర్టులను రద్దు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్... ఆ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు.
* మే, 2001: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం... సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత.
* సెప్టెంబర్ 21, 2001: సీఎం పదవి నుంచి తప్పుకున్న జయలలిత... సీఎంగా పన్నీర్ సెల్వం.
* నవంబర్ 2001: జయలలితను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.
* మార్చి 2, 2002: అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయంతో మరోసారి పీఠమెక్కిన జయలలిత.
* నవంబర్ 2, 2002: అక్రమాస్తుల కేసులో విచారణ పునఃప్రారంభం.
* ఫిబ్రవరి 5, 2003: విచారణ సజావుగా సాగడానికి కేసును మరో రాష్ట్రానికి తరలించాలని డీఎంకే నేత అన్బళగన్ పిటిషన్.
* నవంబర్ 18, 2003: కేసును కర్ణాటకకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.
* అక్టోబర్, నవంబర్ 2011: ప్రత్యేక కోర్టుకు పలుమార్లు హాజరై 1339 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జయ.
* ఆగస్టు 14, 2012: స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగలేనని రాజీనామా చేసిన బీవీ ఆచార్య.
* ఫిబ్రవరి 2, 2013: భవానీ సింగ్‌ కు ప్రాసిక్యూటర్ బాధ్యతలు.
* ఆగస్టు 26, 2013: భవానీసింగ్‌ ను తప్పించిన కర్ణాటక ప్రభుత్వం.
* సెప్టెంబర్ 30, 2013: భవానీసింగ్‌ ను తప్పించడాన్ని తప్పుపట్టిన సుప్రీం... ఆదేశాలు రద్దు.
* ఆగస్టు 28, 2014: విచారణ పూర్తి... తీర్పు సెప్టెంబర్ 20కి వాయిదా.
* సెప్టెంబర్ 16, 2014: తీర్పును సెప్టెంబర్ 27కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రత్యేక కోర్టు.
* సెప్టెంబర్ 27, 2014: జయలలితను దోషిగా తేల్చిన కోర్టు, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా.
* మే 11, 2015: కర్ణాటక హైకోర్టులో జయలలిత పిటిషన్... నిర్దోషిగా ప్రకటిస్తూ నిర్ణయం.
* జూలై, 2015: తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం.
* డిసెంబర్ 5, 2016: రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మరణం.
* ఫిబ్రవరి 14, 2016: నిందితులంతా దోషులేనని ప్రకటించిన సుప్రీంకోర్టు.

  • Loading...

More Telugu News