: మరో మూడున్నరేళ్లు చెరసాలలోనే చిన్నమ్మ!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న ఆమె నెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఇక ఆమె పదేళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. మరోవైపు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె మరో మూడున్నరేళ్లు శిక్షను అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల శిక్షను విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఇప్పటికే ఆరునెలల శిక్షను అనుభవించడంతో మరో మూడున్నరేళ్లు ఆమె జైలుకి వెళ్లవలసి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ అడ్వొకేట్ జనరల్ బీవీ ఆచార్య మాట్లాడుతూ మన జుడీషియరీ ఎంతబలంగా ఉందో ఈ తీర్పు ద్వారా తెలుస్తుందని ఉద్ఘాటించారు.