: వెంటనే లొంగిపోయి, ఇటు నుంచే జైలుకెళ్తా... ఎమ్మెల్యేలతో చెప్పిన శశికళ, ఓదారుస్తున్న నేతలు


సుప్రీంకోర్టు తీర్పుతో నిర్ఘాంతపోయిన శశికళ, చాలాసేపు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయినట్టు తెలుస్తోంది. ఆపై తాను ఇప్పటికిప్పుడు లొంగిపోయి, రిసార్టు నుంచి నేరుగా జైలుకు వెళతానని ఆమె తనతో ఉన్న అన్నాడీఎంకే నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను వారించేందుకు నేతలు ప్రయత్నించారు. కాగా, ఈ తీర్పుతో నిన్నటి నుంచి ఆమె బస చేసిన గోల్డెన్ బే రిసార్టు వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆమె వర్గం బౌన్సర్లు, కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పలువురు మీడియా ప్రతినిధులు, ప్రజలకు గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అక్కడికి అదనపు పోలీసు బలగాలను పంపాలని అధికారులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News