: నాలుగు వారాల్లో లొంగిపొండి: శశికళకు సుప్రీం ఆదేశం
అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు మిగిలిన నిందితులందరూ ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష, రూ. 100 కోట్ల జరిమానాను చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్, తన తీర్పులో పేర్కొన్నారు. కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మిగతా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు దోషులని, వీరంతా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని తెలిపారు. నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించారు. చంద్రఘోష్ తీర్పు చదవడం పూర్తయిన తరువాత, ద్విసభ్య బెంచ్ లోని మరో న్యాయమూర్తి అమితవరాయ్ తీర్పు వెల్లడికానుంది. సుప్రీంకోర్టులో వాతావరణం చూస్తుంటే, ఆయన కూడా శశికళకు వ్యతిరేకంగానే తీర్పిచ్చేలా ఉన్నారని సమాచారం.