: తీర్పు ప్రతికూలమైతే జయలలిత అన్న కొడుకుకు పగ్గాలు... శశికళ కొత్త ఆలోచన!
నేడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రతికూలంగా ఉన్న పక్షంలో వెంటనే, జయలలిత వారసులను తెరపైకి తెచ్చి, ఎమ్మెల్యేలు చేజారకుండా చూడాలని శశికళ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు శశికళ అన్న కుమారుడైన దీపక్ ను ముందు నిలిపి, ఫిరాయించాలని భావించే ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని శశికళ యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే ఉప్పందుకున్న పన్నీర్ వర్గం, దీపక్ ను శశి వర్గం తీసుకువస్తే, అందుకు దీటుగా దీపను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీప నుంచి పన్నీర్ కు సానుకూల సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత రక్త సంబంధీకులను తీసుకువచ్చి పబ్బం గడుపుకోవాలని ఇరు పక్షాలూ ఎత్తుల మీద పైఎత్తులు వేస్తున్నట్టు సమాచారం.