: చిన్నమ్మకు కొత్త చిక్కు... గోల్డెన్ బేలోని ఎమ్మెల్యేల్లో పలువురికి అస్వస్థత!
గడచిన వారం రోజులుగా ఒకే గదిలో ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, సమయానికి మందులు వేసుకోకుండా ఎంజాయ్ చేస్తూ కాలం గడపడంతో గోల్డెన్ బే రిసార్టులోని పలువురు ఎమ్మెల్యేలకు అస్వస్థత కలిగినట్టు తెలుస్తోంది. నేటి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో ఉన్న శశికళ ముందు ఎమ్మెల్యేల అనారోగ్యం పేరిట కొత్త చిక్కులు రాగా, ప్రముఖ వైద్యులను అక్కడికే పిలిపించిన ఆమె వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నట్టు సమాచారం. వీరిలో అత్యధికులు అజీర్ణం, షుగర్ లెవల్స్ పెరగడం వంటి రుగ్మతలతో ఉన్నట్టు తెలుస్తోంది.