: శశికళకు మద్దతిస్తే.. నియోజకవర్గంలోకి కూడా అడుగుపెట్టలేరు.. ఎమ్మెల్యేలకు స్థానిక నేతలు, ప్రజల హెచ్చరిక
అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా... ప్రజల నుంచి మాత్రం పన్నీర్ సెల్వంకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. శశికళకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో, తిరుప్పూరు నార్త్ ఎమ్మెల్యే విజయకుమార్, తిరుప్పూరు సౌత్ ఎమ్మెల్యే గుణశేఖరన్ లకు స్థానిక అన్నాడీఎంకే నేతలు, ప్రజలు వార్నింగ్ ఇచ్చారు. శశికళకు అనుకూలంగా వ్యవహరిస్తే, నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టలేరంటూ హెచ్చరించారు. దివంగత జయలలితకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించాలని వారు విన్నవించారు. లేని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉంటుందని... ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని చెప్పారు.