: పన్నీర్ సెల్వంకు సారీ చెప్పిన శశికళ విధేయుడు!
అన్నాడీఎంకే కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే... పన్నీర్ సెల్వం చేయి నరుకుతానంటూ ఆ పార్టీ నేత, శశికళ విధేయుడు కళైరాజన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానంటూ ఆయన ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని పోయస్ గార్డెన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే కొట్టి తరుముతామంటూ చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. సీఎం చేయి నరుకుతాననే అర్థం వచ్చేలా తాను ఏ వ్యాఖ్యలూ చేయలేదని తెలిపారు. తాను అనని మాటలకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం భావ్యం కాదని అన్నారు. ఒకవేళ తాను అలా అన్నానని ప్రత్యర్థులు భావిస్తే... తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.