: ఇప్పటిదాకా దేశాలను బ్యాన్ చేసిన అమెరికా... ఇప్పుడు దేశాధినేతలను టార్గెట్ చేస్తోంది!


డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత... ఆ దేశ విదేశాంగ విధానాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదులను నిరోధించాలన్న ఉద్దేశ్యంతో, ఏడు ఇస్లామిక్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కారు... ఇప్పుడు ఏకంగా దేశాధినేతలను, వివిధ దేశాల అత్యున్నత స్థాయి ప్రతినిధులను టార్గెట్ చేస్తోంది. నిన్నటికి నిన్న పాక్ సెనేట్ డిప్యూటీ స్పీకర్ కు వీసా మంజూరు చేసేందుకు అమెరికా నిరాకరించింది.

తాజాగా, వెనెజులా ఉపాధ్యక్షుడు తారెక్ ఎల్ ఇస్సామిపై నిషేధం విధించింది. ఇస్సామీని మత్తుపదార్థాల చేరవేతదారుడిగా గుర్తించిన అమెరికా... అతడిని తమ దేశంలో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటనను వెలువరించింది. ఫారిన్ నార్కోటిక్స్ కింగ్ పిన్ డిజిగ్నేషన్ యాక్ట్ కింద ఆయనపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. 

  • Loading...

More Telugu News