: లవర్స్ కోసం విస్తారా ఎయిర్ లైన్స్ 'ప్రేమికుల రోజు' బంపరాఫర్
దేశవాళీ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు బంపరాఫర్ ను ప్రకటించింది. ఐదు రోజుల పాటు ప్రత్యేక తగ్గింపు ధరలను అందిస్తున్నట్టు తెలిపింది. 17వ తేదీ అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉండేలా రూ. 899 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయని, ఎకానమీ విభాగంలో ఓ వైపు ప్రయాణానికి ఈ ధర వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణ తేదీని ఎంచుకోవాల్సి వుంటుందని తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా బిజినెస్ క్లాస్ లో 60శాతం డిస్కౌంట్ ను, ప్రీమియం ఎకానమీ విభాగంలో 40శాతం వరకు రాయితీని అందిస్తామని పేర్కొంది. ఇండియాలో తమ సర్వీసులు నడుస్తున్న 20 నగరాలు, పట్టణాలకు ప్రయాణించవచ్చని, ఇటీవల తమ సర్వీసులు ప్రారంభమైన పోర్ట్ బ్లెయిర్, అమృత్సర్, లేహ్ సర్వీసులకూ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.