: ట్వీటేసి విమర్శలు కొనితెచ్చుకున్న సెహ్వాగ్!


తనదైన ట్వీట్లతో అభిమానులను, ప్రజలను అలరిస్తుండే మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈసారి మాత్రం విమర్శలు కొనితెచ్చుకున్నాడు. అంధుల టీ-20 వరల్డ్ కప్ గెలిచిన వారికి అభినందనలు తెలుపుతూ, 'మరో జట్టు' అని సెహ్వాగ్ పేర్కొనడంపై జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ లాంటి వ్యక్తి తమను ఇతరులని పేర్కొనడమేంటని ప్రశ్నించాడు. తమది కూడా నీలిరంగు జట్టేనని, టీమిండియా ధరించే జర్సీలనే తాము కూడా ధరించి మైదానంలోకి దిగుతామని, వారు ఆడినంత కసిగానే తాము కూడా ఆడతామని అన్నాడు. వీరూ తన ట్వీట్ లో "అంధుల టీ-20 వరల్డ్ కప్‌ గెలిచిన మరో నీలి రంగు జట్టుకు అభినందనలు. వాళ్లు వంద కోట్లమందికి చిరునవ్వులు పంచారు" అని అన్నాడు. దీనిపై పలువురు క్రీడాభిమానులు సైతం వీరేంద్ర తొందర పడ్డాడని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News