: శశికళపై అలకబూనిన తంబిదురై.. పార్టీ కోశాధికారి పదవి ఇవ్వనందుకేనని ప్రచారం


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై లోక్‌సభ డిప్యూటీ  స్పీకర్ ఎం.తంబిదురై అలకబూనారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తప్పించిన శశికళ ఆ పదవిని తనకు ఇస్తారని తంబిదురై భావించారు. అయితే సీనియర్ నేత కేఏ సెంగొట్టయ్యన్‌ను ఆ పదవిలో నియమించడంతో గుర్రుగా ఉన్న తంబిదురై నాలుగు రోజులగా పోయెస్‌ గార్డెన్‌కు దూరంగా ఉంటున్నారు. జయ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తంబిదురై  పోటీపడ్డారు.

అయితే శశికళ ఆ పదవిని చేపట్టడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యాక ఆ పదవిలో తాను కూర్చోవాలని భావించారు. చివరికి ఆ కోరికా నెరవేరడం లేదు.  శశికళపై పన్నీర్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో చిన్నమ్మ అతడిని పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించారు. దీంతో ఆ పదవి తనకు దక్కుతుందని తంబిదురై భావించారు. అయితే ఆ పదవిని సెంగొట్టయ్యన్‌కు కట్టబెట్టడంతో తంబిదురై మనస్తాపం చెందారు. నాలుగు రోజుల నుంచి శశికళకు దూరంగా ఉంటున్నారు. అయితే ‘ఢిల్లీ’ ఆదేశాల మేరకే ఆయన శశికళకు దూరంగా ఉంటున్నారని తంబిదురై అనుచరులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News