: శశికళను పోయెస్ గార్డెన్ నుంచి తరమివేయాలంటూ నిరాహారదీక్ష


దివంగత ముఖ్యమంత్రి నివాసమైన ‘వేద నిలయం’లో తిష్ఠ వేసిన శశికళను అక్కడి నుంచి తరిమి వేయాలని డిమాండ్ చేస్తూ ‘జయ పేరవై’ కార్యకర్తలు నిరాహార దీక్షకు ప్రయత్నించారు. జయపేరవై స్థానిక విభాగం నాయకుడు రాజా మహమ్మద్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం చెన్నైలోని పుళల్ సమీపంలోని ఎంజీఆర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఇందుకోసం కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఎంజీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో శశికళకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పొయెస్ గార్డెన్ నుంచి ఆమెను తరిమివేయాలంటూ బిగ్గరగా నినదించారు. రాజా మహమ్మద్ సహా 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి తిరువళ్లూరులో ఉన్న ఓ ప్రైవేటు మండపానికి తీసుకెళ్లి వదిలేశారు.

  • Loading...

More Telugu News