: ఓడిన బంగ్లా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో ఏం చేశారో తెలుసా?
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియాపై టెస్టు ఓడిన అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో ఏం చేశారో తెలుసా? కోహ్లీ దగ్గరకు క్యూ కట్టారు. యువకులతో నిండి ఉన్న బంగ్లా జట్టు మొత్తం కోహ్లీని కలిసేందుకు ఉత్సాహం కనబరిచింది. కోచ్ తో పాటు ఆటగాళ్లంతా కోహ్లీ చుట్టూ చేరారు. కోహ్లీతో సెల్ఫీలు దిగారు. తమ టీషర్టులపై కోహ్లీ ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు. కోహ్లీని చిట్కాలు అడిగారు. బ్యాటింగ్ మెళకువలు, ఫిట్ నెస్ చిట్కాలు తెలుసుకుని మురిసిపోయారు. కాగా, ఈ మధ్య కాలంలో టోర్నీలు ముగిసిన అనంతరం కోహ్లీని కలవడం ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సాధారణంగా మారిపోయింది. దీంతో ఆటగాళ్ల స్పోర్టివ్ నేచర్ పై వెటరన్ లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.