: శశికళాజీ, లాక్ చేసేయమంటారా?.. అమితాబ్ ప్రశ్నిస్తున్నట్లు గా నెటిజన్ల సెటైర్లు!


తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా? అని అంతా ఎదురు చూస్తుంటే, నెటిజన్లు మాత్రం ఎవరి స్థాయిలో వాళ్లు సామాజిక మాధ్యమాల వేదికగా సెటైర్లు, జోక్స్ వేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఇంకొంచెం ముందుకెళ్లి.. పాప్యులర్ టీవీ షోలలో వ్యాఖ్యాతగానో లేక యాంకర్ పాత్ర పోషించిన ప్రముఖ నటుల మాటలనో ఈ సంక్షోభానికి అన్వయిస్తున్నారు.

ఈ క్రమంలో పాప్యులర్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఈ షోలో పాల్గొన్న పోటీదారుడిని, వ్యాఖ్యాతగా వ్యవహరించే అమితాబ్ తన కంప్యూటర్ ముందు కూర్చుని ప్రశ్నిస్తాడు. ఆ వ్యక్తి  సమాధానం చెప్పిన తర్వాత ‘లాక్’ చేసేయమంటారా? అని ఆయన అడిగే విధానం ప్రజాదరణ పొందింది. అయితే, ఈ షోలో శశికళ పాల్గొన్నట్లు, వ్యాఖ్యాత గా వ్యవహరించే అమితాబ్  ప్రశ్నిస్తున్నట్లుగా ఊహిస్తూ నెటిజన్లు డైలాగ్స్ కూడా రాసేశారు. సరదా పుట్టించే ఆ సంభాషణ ఇలా సాగుతుంది..

అమితాబ్: శశికళాజీ ! మీ వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 0,129,134?
శశికళ: 129
అమితాబ్: నిజమా?
శశికళ: అవును
అమితాబ్: నమ్మకంగా చెబుతున్నారా?
శశికళ: అవును
అమితాబ్: అయితే, ‘లాక్’ చేసేయమంటారా?
శశికళ: ఎందుకు, వారిని, ఇప్పటికే లాక్ చేసేశాగా!
..అంటూ ఆ సంభాషణ సాగుతుంది. 

  • Loading...

More Telugu News