: కరుణానిధి భార్యకు తుపాకీతో బెదిరింపు... తమిళనాట కలకలం.. నిందితుడి అరెస్ట్!


తమిళనాట పెను కలకలం రేగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భార్యకు ఆగంతుకుడు తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు దిగడం పెనుకలకలం రేపుతోంది. సాక్షాత్తూ కరుణానిధి ఇంట్లోకి తుపాకీతో ప్రవేశించిన ఆగంతుకుడు ఎదురుగా కనిపించిన కరుణానిధి భార్య తలకు గురిపెట్టి ఇంట్లోని విలువైన వస్తువులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ వార్త తమిళనాట పెను కలకలం రేపింది. 

  • Loading...

More Telugu News