: ప్రత్యేక హోదాపై రాజకీయపార్టీల నుంచి అకౌంటబులిటీ కోరుకుంటున్నాను: పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని, ఇస్తామని చెప్పిన పార్టీలన్నీ అధికారంలోకి వచ్చిన తరువాత మాటలు మార్చాయని సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాలో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ పార్టీల నుంచి అకౌంటబులిటీ కోరుకుంటున్నానని చెప్పారు. 'మా ఇష్టప్రకారం హామీ ఇచ్చాము, మా ఇష్టప్రకారం దాని నుంచి తప్పుకున్నా'మంటే చూస్తూ ఊరుకోమని, దానికి సహేతుకమైన కారణాలు వివరించాలని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. అవకాశవాద రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకమని ఆయన అన్నారు. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. ఏ భావజాలంతో రాజకీయ పార్టీగా జనసేన వచ్చిందో దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యమని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకమని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News