: వికారాబాద్ జిల్లా దుద్యాలలో ప్రేమ జంట ఆత్మహత్య


వికారాబాద్ జిల్లాలోని దుద్యాలలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నందిగామ దగ్గర్లోని పిట్టలగూడకు చెందిన అఖిలకు మేనమామతో వివాహం నిశ్చయించారు. అయితే, ఆ వివాహం ఇష్టం లేని అఖిల, ఆమె ప్రియుడు మధు కలసి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యను అటుగా వెళ్లిన వ్యక్తులు చూసి, పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News