: ఆ సమయంలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం: స్టాలిన్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ నిర్ణయాన్ని బల పరీక్షా సమయంలోనే వెల్లడిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన అనంతరం, స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైతే మెజార్టీ కలిగి ఉంటారో, వారినే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారనే విషయాన్ని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు.