: అమ్మదనంలోని కమ్మదనాన్ని వివరించిన పాట.. మెస్మరైజ్ చేసిన బియాన్సే!


గ్రామీ అవార్డు కార్యక్రమంలో అమెరికన్ పాప్ స్టార్ బియాన్సే ఆహూతులను మదర్ వుడ్ పాటతో మాయాలోకంలో విహరింపజేసింది. ఈజిప్ట్ క్వీన్ తరహాలో బంగారు రంగు దుస్తులు ధరించిన బియాన్సే అమ్మ కమ్మదనం తెలిపే పాటతో ప్రేక్షకులను రంజింపజేసింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న బియాన్సే మాతృత్వపు కమ్మదనం తెలిపే పాటను పాడడంతో ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు ఆ పాటను లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. మీరు కూడా ఆ పాటను వీక్షించండి.


  • Loading...

More Telugu News