: భారీ కాన్వాయ్ తో రిసార్ట్ కు చేరుకున్న శశికళ... పనిలో పనిగా పన్నీర్ పై తీవ్ర విమర్శలు


అన్నాడీఎంకే తాత్కాలిక అధినేత్రి శశికళా నటరాజన్ భారీ కాన్వాయ్ తో మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్‌ లోని గోల్డెన్ బే రిసార్టుకు తరలివెళ్లారు. అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ విద్యాసాగరరావుకు అటార్నీ జనరల్ ముకుల్ రొహ్గతీ సూచించారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో శశికళ శిబిరంలో ఆనందం నెలకొంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో చిన్నమ్మ అధికారం చేపట్టడం ఖాయం అంటూ ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు భారీ ఎత్తున గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో అక్కడ సందడి నెలకొంది. భారీ కాన్వాయ్ తో ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఆమె మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఘాటు విమర్శలు చేశారు. పన్నీర్ సెల్వంను నమ్మకద్రోహిగా అభివర్ణించారు. అమ్మకు పన్నీర్ సెల్వం ఏనాడూ విశ్వాసపాత్రుడిగా మసలలేదంటూ నిందలు మోపారు. పన్నీర్ సెల్వం తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరంటూ చాలెంజ్ చేశారు. 

  • Loading...

More Telugu News