: వారంలోగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి: గవర్నర్ కు అటార్నీ జనరల్ సలహా
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్నటు వంటి క్యాంపు రాజకీయాలు తమిళనాడులో ఆసక్తి రేపుతుండగా, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అని దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రేపు శశికళ ఆస్తుల కేసుపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమిళనాడు ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగరరావు అటార్నీ జనరల్ సలహా కోరారు. దీనిపై అటార్నీ జనరల్ సలహా ఇస్తూ... వారం రోజుల్లోగా తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశాల్లో బలనిరూపణకు ఆదేశించాలని, సభలో ఎవరు బలనిరూపణ చేసుకుంటారో వారినే సీఎంగా నియమించాలని, దీంతో తమిళనాడు రాజకీయ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.