: చెన్నై ఎయిర్ పోర్టులో ప్రభాస్ వెనుక పడ్డ లేడీ ఫ్యాన్స్!


‘డార్లింగ్’ ప్రభాస్ కు ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడియో ఫంక్షన్లు, ఇతర వేడుకలకు ప్రభాస్ హాజరైన సందర్భంలో ఈ ఆరడుగుల అందగాడిని చూసేందుకు, ఆటో గ్రాఫ్ తీసుకునేందుకు, ఓ సెల్ఫీ దిగేందుకు ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా, చెన్నై ఎయిర్ పోర్టులో ప్రభాస్ వెంట లేడీ ఫ్యాన్స్ పడ్డారు. ప్రభాస్ తన సన్నిహితులతో వెళుతుండగా, కొంత మంది అమ్మాయిలు ఆయన్ని గుర్తించారు. అంతే .. ఆయనతో కలిసి ఒక సెల్ఫీ అయినా దిగుదామనే ఉద్దేశంతో ప్రభాస్ వెనుక పడ్డారు. మరి, ప్రభాస్ తో వాళ్లు సెల్ఫీ దిగారో? లేదో? తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలకు చేరింది. 

  • Loading...

More Telugu News