: స్టాలిన్ అధ్యక్షతన కాసేపట్లో డీఎంకే అత్యవసర సమావేశం!


తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శశికళా నటరాజన్, పన్నీర్ సెల్వం మధ్య నెలకొన్న అధికార పీఠం రాజకీయ క్రీడలో తామెందుకు స్తబ్ధుగా ఉండాలని భావించిన డీఎంకే సరికొత్త పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో చీలికల తరువాత ఏం జరుగుతుందో చూద్దామని భావించిన డీఎంకే నేటివరకు ఎలాంటి ఎత్తుగడలు వేయకుండా పన్నీర్ సెల్వంకు మద్దతిచ్చే దిశగా మౌనంగా ఉంది.

 అయితే డీఎంకే అంచనాలు వమ్ము చేస్తూ శశికళ అధికారపీఠం చేపట్టేదిశగా చర్యలు చేపట్టడంతో దానినిపై చర్చించేందుకు డీఎంకే సీనియర్ నేతలతో పార్టీ శాసనసభా పక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారం చేపట్టేందుకు డీఎంకేకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో అన్నాడీఎంకే విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, తమ ప్రభుత్వమే అధికారంలోకి రానుందంటూ లేఖలు రాయడం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న దానిపై ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News