: హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్య కేసులో రాష్ట్రపతి పేరు ఎందుకు?: హైకోర్టు
గత ఏడాది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు అభ్యంతరాలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా చేర్చారు. ఈ విషయంపై హైకోర్టు ప్రశ్నించగా.. ఆ వర్సిటీకి వీసీని నియమించింది రాష్ట్రపతి కాబట్టే ఆయన పేరును కూడా చేర్చామని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టుకి తెలిపారు. కాగా, ఈ అభియోగానికి తగ్గట్టుగా వచ్చే సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.