: బలం ఉందన్నప్పుడు ఆహ్వానించక తాత్సారమెందుకు?: గవర్నర్ ను ప్రశ్నిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని శశికళా నటరాజన్ చెబుతున్నప్పుడు గవర్నర్ ఆమెను ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని ఆయన తెలిపారు. 'శశికళకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు సరిపడ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల మద్దతుకు వారి సంతకాలతో కూడిన పత్రాలు ఇప్పటికే అందజేశారు. అవసరమైతే అసెంబ్లీలో బలనిరూపణకు కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు ఆమెను ఆహ్వానించకుండా తాత్సారం చేయడమెందుకు?' అని ఆయన ప్రశ్నించారు. కాగా, శనివారం గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన ఆదివారంలోపు నిర్ణయం తీసుకోకుంటే తానే కోర్టులో వ్యాజ్యం వేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.