: అన్నయ్య 150వ సినిమా చాలా బాగుంది...ఆయనతో కలిసి సినిమా చేసే ప్రతిపాదనేదీ నాకు రాలేదు: పవన్ కల్యాణ్
అన్నయ్య చిరంజీవి 150వ సినిమా చాలా బాగుందని, ఈ సినిమా చూడటం ద్వారా ఒక మంచి అనుభూతి కలిగిందని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడుపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను ఇక్కడికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా గురించి నేను ఎప్పుడూ అంత ఎక్కువగా ఆలోచించుకోను. నేను దేని కోసం కమిటెడ్ గా ఉంటానో.. ఆ పని చేస్తాను. హార్వర్డ్ లో జరిగిన కార్యక్రమానికి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..... సమకాలీన రాజకీయాల గురించే చర్చించేందుకు నాకు సరైన ప్లాట్ ఫామ్ దొరికింది. ఈ రోజున ఫుట్ టైమ్ పొలిటీషియన్ ఎవరూ లేరు. వాళ్లా వ్యాపారాలు వాళ్లు చేసుకుంటున్నారు. నేను ఫుల్ టైమ్ పాలిటిక్స్ కు వచ్చినప్పుడు ప్రజలకు 24x7 అందుబాటులో ఉంటాను. ప్రజలకు అందుబాటులో ఉండటమంటే .. ప్రజల కోసం 24 గంటలు పనిచేయగలుగుతాను....అవకాశ వాద రాజకీయాలతో వచ్చే వారిని నా దగ్గరకు తీసుకోవడం ఇష్టం లేదు... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి, కచ్చితంగా ఇచ్చి తీరాలి. లేకపోతే, రోడ్డుపైకి వస్తాం... ’అని పవన్ కల్యాణ్ చెప్పారు.