: శశికళ బలనిరూపణకు గవర్నర్‌ అవకాశం ఇవ్వాలి: సీపీఐ నేత నారాయణ


త‌మిళ‌నాడులో కొన‌సాగుతున్న రాజ‌కీయ త‌తంగంపై సీపీఐ నేత నారాయ‌ణ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శశికళ బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగ‌ర్‌ రావు అవకాశం ఇవ్వాలని ఆయ‌న అన్నారు. గవర్నర్‌ వ్యవస్థ కేంద్ర ప్ర‌భుత్వానికి ఊడిగం చేసేలా ఉంద‌ని, రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడటం లేదని ఆయ‌న అన్నారు. బీజేపీ ఒక‌ మతతత్వ పార్టీ అని, దానికి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమవుతున్నాయని ఆయ‌న చెప్పారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొన‌సాగిస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో కేసీఆర్ కొంద‌రిని త‌మ‌ మిత్రులన్నార‌ని.. కానీ, ఇప్పుడు వారినే శత్రువులని అంటున్నారని ఆయ‌న విమర్శించారు.

  • Loading...

More Telugu News