: తన చిన్ననాటి గురువులను ఆప్యాయంగా పలకరించిన వీవీఎస్ లక్ష్మణ్!
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన చిన్ననాటి గురువులను ఆప్యాయంగా పలకరించాడు. చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాలను ఆయన సందర్శించాడు. హైదరాబాద్ ఆబిడ్స్ లోని లిటిట్ ఫ్లవర్ హై స్కూల్ ను నిన్న తాను సందర్శించినట్లు వీవీఎస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు. పాఠశాల ప్రాంగణంలో తిరుగుతూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని అన్నాడు. తాను చదువుకున్న పాఠశాలను, తనకు విద్య బోధించిన గురువులను కలుసుకున్న ప్రతిసారి ఓ గొప్ప అనుభూతి కలుగుతుందని, తన జీవితంపై వారి ప్రభావం ఎంతగానో ఉందని.. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని లక్ష్మణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గురువులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు.