: గవర్నర్ ను ఆదేశించండి: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శశికళ వర్గం
కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నా... బల నిరూపణకు గవర్నర్ తమను ఆహ్వానించకపోవడం పట్ల శశికళ వర్గం గుర్రుగా ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖలు రాస్తున్నా... సమాధానం రాకపోవడంతో, వారిలో సహనం చచ్చిపోతోంది. దీని వెనుక బీజేపీ, డీఎంకేల కుట్ర దాగుందని శశికళ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను వెంటనే ఆహ్వానించేలా గవర్నర్ కు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ శశి వర్గీయులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో వారు కోరారు.