: రిసార్టులో ఎమ్మెల్యేలను నిర్బంధించలేదు: హైకోర్టుకి తెలిపిన పోలీసులు
తమిళనాడులో అన్నాడీఎంకే ‘ఎమ్మెల్యేల నిర్బంధం’ పిటిషన్ కు సంబంధించిన తీర్పును మద్రాసు హైకోర్టు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు హైకోర్టుకు పోలీసులు ఇచ్చిన నివేదికలో పలు వివరాలు పేర్కొన్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేల వద్ద తీసుకున్న వాంగ్మూలంలో తమతో ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగానే అక్కడ ఉంటున్నట్లు చెప్పారని పోలీసులు తెలిపారు. అందులో ఒక్కరిని కూడా అక్రమంగా అక్కడ ఉంచలేదని వారు పేర్కొన్నారు.
తమకు ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదులు చేయలేదని సైతం తేల్చిచెప్పారు. అయితే, ఈ కేసు వేసిన పిటిషనర్ హైకోర్టును అమికస్ క్యూరీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ వాదనలను వినిపించాలని హైకోర్టు పేర్కొంది.